భార్య సమ్మతి అవసరంలేదు..కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయండి: హైకోర్టు
అపోలో ఆసుపత్రికి హైకోర్టు ఆదేశం
మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న చెల్లెలికి మూత్రపిండం దానం చేసేందుకు ముందుకొచ్చిన అన్నకు హైకోర్టులో ఊరట లభించింది.
భార్య అనుమతి ఉంటే తప్ప కిడ్నీ దానం చేసేందుకు అనుమతించబోమంటూ అపోలో హాస్పిటల్స్ చేస్తున్న వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తున్నందున భార్య సమ్మతి లేకుండానే కిడ్నీ దానానికి అనుమతించాలని, వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించాలని అపోలో ఆస్పత్రిని ఆదేశించారు.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
వివరాలు…
నగరానికి చెందిన కె. వెంకట్ నరేన్ (39), బి.మాధురిలు అన్నాచెల్లెళ్లు. మాధురికి 2012లో వివాహమైంది.
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాధురిని పరీక్షించిన అపోలో వైద్యులు ఆమెకు మూత్రపిండం ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరని తేల్చారు.
వైద్య పరీక్షల అనంతరం వెంకట్ నరేన్ మూత్రపిండాన్ని అమర్చేందుకు అనుకూలంగా ఉందని నిర్ధారించారు.
అయితే వెంకట్ నరేన్ భార్య సమ్మతి ఉంటే తప్ప ట్రాన్స్‌ప్లాంటేషన్ శస