నేడు పరిశీలించనున్న సుప్రీంకోర్టు
కొవిడ్ సమయంలో అలోపతి ఔషధాల వినియోగానికి సంబంధించి యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యల అసలు (ఒరిజినల్) రికార్డులను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించనుంది. తన వ్యాఖ్యలకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తుపై స్టే విధించాలని, తనపై వేర్వేరు చోట్ల నమోదైన కేసులన్నింటినీ కలిపి.. దిల్లీకి బదిలీ చేయాలని రాందేవ్ గతంలో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విధితమే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదుల మేరకు ఆయనపై పట్నా, రాయ్‌పుర్‌లలో అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నింటినీ కలిపేసి, దిల్లీకి బదిలీ చేయాలంటూ రాందేవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఏ.ఎస్.బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది..కొవిడ్ సమయంలో అలోపతి ఔషధాల వినియోగానికి సంబంధించి యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యల అసలు (ఒరిజినల్) రికార్డులను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించనుంది. తన వ్యాఖ్యలకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తుపై స్టే విధించాలని, తనపై వేర్వేరు చోట్ల నమోదైన కేసులన్నింటినీ కలిపి.. దిల్లీకి బదిలీ చేయాలని రాందేవ్ గతంలో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విధితమే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదుల మేరకు ఆయనపై పట్నా, రాయ్‌పుర్‌లలో అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నింటినీ కలిపేసి, దిల్లీకి బదిలీ చేయాలంటూ రాందేవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఏ.ఎస్.బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది..