గోడలు బద్దలు కొట్టి అధికారాన్ని గుంజుకుంటాం
అమరవీరుల స్తూపాన్నీ వదలకుండా దోచుకున్నారు
ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉంటే..
ఆయన గెలుపును కేసీఆర్ కూడా ఆపలేక పోయేవారు
పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలి
ఈ ప్రభుత్వం 2023 అక్టోబరు వరకు ఉండబోదు
పీసీసీ అధ్యక్షుడిని నియమించేది సోనియాగాంధీ
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్ కాదు
నా కష్టానికి అదృష్టం తోడవడం వల్లే పీసీసీ పదవి
ప్రజల్ని మోసగించేందుకు కేసీఆర్, జగన్ డూప్ ఫైట్
సీమాంధ్ర ప్రజలకు మేము రక్షణకవచంలా ఉంటాం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
కేసీఆర్ సూడో లౌకికవాది..
ప్రధాని మోదీకి ఏజెంట్
టీఆర్‌ఎస్, బీజేపీ రహస్య మైత్రిని గమనించండి
ముస్లిం సమాజానికి రేవంత్‌రెడ్డి పిలుపు
ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి.. కేసీఆర్ నుంచి అధికారాన్ని గుంజుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. అదేమీ కేసీఆర్ జాగీరు కాదని, 1200 మంది అమరవీరులు బలిదానం చేస్తే వచ్చిందని పేర్కొన్నారు. శనివారం రేవంత్‌రెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ”ఉద్యమ సమయంలో వంటా వార్పు, బతుకమ్మలాట పేరుతో ఆడుతూ పాడుతూ తిరిగిన నీకే వంద తరాలు తిన్నా తరగనంత ఆస్తిని ప్రజలు ఇచ్చారు. అలాంటిది ఆత్మబలిదానం చేసుకున్న నూనూగు మీసాల శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏమివ్వాలి? కనీస గౌరవమైనా ఇచ్చినవా?” అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, ఆయన సహచరులు అమరవీరుల స్తూపాన్ని కూడా వదలకుండా దోపిడీకి పాల్పడ్డారని, స్తూపం అంచనాలను రూ.80 కోట్ల నుంచి రూ.180 కోట్లకు పెంచి వంద కోట్ల దాకా దోపిడీ చేశారని ఆరోపించారు.ఈటల రాజేందర్ కాంగ్రెస్ వైపునకు మళ్లితే హుజూరాబాద్‌లో ఆయన గెలుపును కేసీఆర్ కూడా ఆపలేక పోయేవారని రేవంత్ వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీలో ఈటలను చేర్చుకునేందుకు కేసీఆర్ సహకరించారన్నారు. కేసీఆర్‌తో యుద్ధం చేద్దామని బీజేపీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి నుంచి అనేక మందికి ఆ పార్టీలో తమ గొంతు వినిపించే అవకాశమే దొరకలేదన్నారు.
రాజీనామా చేశాకే పార్టీ మారాలి..
రాజ్యాంగంలో పార్టీల విలీనానికే అవకాశం ఉందని, శాసనసభాపక్షం విలీనం అనేది లేనేలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ను దించి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయినప్పుడు ప్రజలు తిరగబడితే విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు తిరిగి వచ్చారని తెలిపారు. అలాంటి పిలుపునే తమ కార్యకర్తలకు ఇస్తున్నామన్నారు. పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పును కోరాలన్నారు. తాను టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చానన్నారు. అప్పుడు ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా… తాను ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే చేరానని గుర్తు చేశారు. కేసీఆర్‌ది సూసైడల్ టెండెన్సీ అని, ఆయన ఏ పదవీకాలాన్నీ పూర్తి చేయలేదని అన్నారు. ఈ ప్రభుత్వం 2023 అక్టోబరు వరకు మనుగడ సాగించబోదని జోస్యం చెప్పారు. పీసీసీ అధ్యక్ష నియామకంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారే తప్ప.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. ”ఎల్బీనగర్ సమస్యల పరిష్కారం కోసం పార్టీ మారుతున్నానని చెప్పి.. ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకకున్నా మాట్లాడని సుధీర్‌రెడ్డి తన గురించి మాట్లాడతాడా?” అని రేవంత్ ప్రశ్నిం చారు. రాజకీయాల్లో తన కష్టానికి అదృష్టంకూడా తోడు కావడంవల్లే పీసీసీ అధ్యక్ష పదవి వరించిందన్నారు.
వైఎస్సార్‌ను దూషిస్తుంటే స్పందించరా?
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు దూషిస్తుంటే.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్ స్పందించకపోవడం బాధాకరమని రేవంత్‌రెడ్డి అన్నారు. తనకు చంద్రబాబునాయుడు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించారంటూ వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిక్కలోడని, శునకానందం పొందుతున్నాడని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన అణాపైసా విలువ చేయడని, ఆయన మాటల్ని తాను పట్టించుకోనని తెలిపారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల కోసం సంయమనం పాటిస్తున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ”తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలకు రక్షణ కోటగా నేనుంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వారి గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జాలి చూపాల్సిన పనిలేదు. రాజ్యాంగం ప్రజలకు రక్షణ కల్పించింది. నీళ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకో” అని ఏపీ సీఎం జగన్‌కు రేవంత్ సూచించారు. నీళ్ల విషయంలో కేసీఆర్, జగన్‌ది డూప్ ఫైట్ అని రేవంత్‌రెడ్డి అన్నారు. వాళ్లిద్దరికి నీళ్లు, ఓట్లు.. నోట్లు కురిపించే ఏటీఎంల లాగా మారాయన్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సూడో లౌకికవాది..
సీఎం కేసీఆర్ ఓ సూడో సెక్యులరిస్ట్ (నకిలీ లౌకికవాది) అని, బీజేపీకి, ప్రధాని మోదీకి ఏజెంట్ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీతో టీఆర్‌ఎస్ రహస్య మైత్రిని గమనించాలని, మతతత్వ శక్తులను ఓడించేందుకు ముస్లింలంతా కాంగ్రె్‌సతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో కాంగ్రెస్ ముస్లిం నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఒక ముస్లింకు హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మొత్తం సమాజానికే అధికారం ఇచ్చినట్లుగా కేసీఆర్ భావిస్తున్నారన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సీఎం, గవర్నర్ వంటి ఉన్నత పదవుల్లోనూ ముస్లింలను కాంగ్రెస్ నియమించిందన్నారు. ముస్లింలు టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. మైనారిటీలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్ మద్దతిచ్చిందన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పుడు ఒక మతతత్వ వాదిగా మారారని, ముస్లింల పేరిట ఉన్న సంస్థలు, ప్రదేశాలకు వేరే పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. టీపీసీసీ తాజా మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమ్‌కుమార్‌ను శనివారం ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్ ఏవీ డిగ్రీ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇదిలా ఉండగా.. క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను రేవంత్ రెడ్డి కలిసే కార్యక్రమానికి సోమవారం నుంచి విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి._*గోడలు బద్దలు కొట్టి అధికారాన్ని గుంజుకుంటాం*_ _*అమరవీరుల స్తూపాన్నీ వదలకుండా దోచుకున్నారు*_ _*ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉంటే..*_ _*ఆయన గెలుపును కేసీఆర్ కూడా ఆపలేక పోయేవారు*_ _*పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలి*_ _*ఈ ప్రభుత్వం 2023 అక్టోబరు వరకు ఉండబోదు*_ _*పీసీసీ అధ్యక్షుడిని నియమించేది సోనియాగాంధీ*_ _*రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్ కాదు*_ _*నా కష్టానికి అదృష్టం తోడవడం వల్లే పీసీసీ పదవి*_ _*ప్రజల్ని మోసగించేందుకు కేసీఆర్, జగన్ డూప్ ఫైట్*_ _*సీమాంధ్ర ప్రజలకు మేము రక్షణకవచంలా ఉంటాం*_ _*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు*_ _*కేసీఆర్ సూడో లౌకికవాది..*_ _*ప్రధాని మోదీకి ఏజెంట్*_ _*టీఆర్‌ఎస్, బీజేపీ రహస్య మైత్రిని గమనించండి*_ _*ముస్లిం సమాజానికి రేవంత్‌రెడ్డి పిలుపు*_ _ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి.. కేసీఆర్ నుంచి అధికారాన్ని గుంజుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. అదేమీ కేసీఆర్ జాగీరు కాదని, 1200 మంది అమరవీరులు బలిదానం చేస్తే వచ్చిందని పేర్కొన్నారు. శనివారం రేవంత్‌రెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ”ఉద్యమ సమయంలో వంటా వార్పు, బతుకమ్మలాట పేరుతో ఆడుతూ పాడుతూ తిరిగిన నీకే వంద తరాలు తిన్నా తరగనంత ఆస్తిని ప్రజలు ఇచ్చారు. అలాంటిది ఆత్మబలిదానం చేసుకున్న నూనూగు మీసాల శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏమివ్వాలి? కనీస గౌరవమైనా ఇచ్చినవా?” అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, ఆయన సహచరులు అమరవీరుల స్తూపాన్ని కూడా వదలకుండా దోపిడీకి పాల్పడ్డారని, స్తూపం అంచనాలను రూ.80 కోట్ల నుంచి రూ.180 కోట్లకు పెంచి వంద కోట్ల దాకా దోపిడీ చేశారని ఆరోపించారు.ఈటల రాజేందర్ కాంగ్రెస్ వైపునకు మళ్లితే హుజూరాబాద్‌లో ఆయన గెలుపును కేసీఆర్ కూడా ఆపలేక పోయేవారని రేవంత్ వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీలో ఈటలను చేర్చుకునేందుకు కేసీఆర్ సహకరించారన్నారు. కేసీఆర్‌తో యుద్ధం చేద్దామని బీజేపీలో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి నుంచి అనేక మందికి ఆ పార్టీలో తమ గొంతు వినిపించే అవకాశమే దొరకలేదన్నారు._ _రాజీనామా చేశాకే పార్టీ మారాలి.._ _రాజ్యాంగంలో పార్టీల విలీనానికే అవకాశం ఉందని, శాసనసభాపక్షం విలీనం అనేది లేనేలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ను దించి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయినప్పుడు ప్రజలు తిరగబడితే విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు తిరిగి వచ్చారని తెలిపారు. అలాంటి పిలుపునే తమ కార్యకర్తలకు ఇస్తున్నామన్నారు. పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పును కోరాలన్నారు. తాను టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చానన్నారు. అప్పుడు ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా… తాను ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే చేరానని గుర్తు చేశారు. కేసీఆర్‌ది సూసైడల్ టెండెన్సీ అని, ఆయన ఏ పదవీకాలాన్నీ పూర్తి చేయలేదని అన్నారు. ఈ ప్రభుత్వం 2023 అక్టోబరు వరకు మనుగడ సాగించబోదని జోస్యం చెప్పారు. పీసీసీ అధ్యక్ష నియామకంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారే తప్ప.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. ”ఎల్బీనగర్ సమస్యల పరిష్కారం కోసం పార్టీ మారుతున్నానని చెప్పి.. ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకకున్నా మాట్లాడని సుధీర్‌రెడ్డి తన గురించి మాట్లాడతాడా?” అని రేవంత్ ప్రశ్నిం చారు. రాజకీయాల్లో తన కష్టానికి అదృష్టంకూడా తోడు కావడంవల్లే పీసీసీ అధ్యక్ష పదవి వరించిందన్నారు._ _వైఎస్సార్‌ను దూషిస్తుంటే స్పందించరా?_ _దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు దూషిస్తుంటే.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్ స్పందించకపోవడం బాధాకరమని రేవంత్‌రెడ్డి అన్నారు. తనకు చంద్రబాబునాయుడు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించారంటూ వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిక్కలోడని, శునకానందం పొందుతున్నాడని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన అణాపైసా విలువ చేయడని, ఆయన మాటల్ని తాను పట్టించుకోనని తెలిపారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల కోసం సంయమనం పాటిస్తున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ”తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలకు రక్షణ కోటగా నేనుంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వారి గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జాలి చూపాల్సిన పనిలేదు. రాజ్యాంగం ప్రజలకు రక్షణ కల్పించింది. నీళ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకో” అని ఏపీ సీఎం జగన్‌కు రేవంత్ సూచించారు. నీళ్ల విషయంలో కేసీఆర్, జగన్‌ది డూప్ ఫైట్ అని రేవంత్‌రెడ్డి అన్నారు. వాళ్లిద్దరికి నీళ్లు, ఓట్లు.. నోట్లు కురిపించే ఏటీఎంల లాగా మారాయన్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు._ _కేసీఆర్ సూడో లౌకికవాది.._ _సీఎం కేసీఆర్ ఓ సూడో సెక్యులరిస్ట్ (నకిలీ లౌకికవాది) అని, బీజేపీకి, ప్రధాని మోదీకి ఏజెంట్ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీతో టీఆర్‌ఎస్ రహస్య మైత్రిని గమనించాలని, మతతత్వ శక్తులను ఓడించేందుకు ముస్లింలంతా కాంగ్రె్‌సతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో కాంగ్రెస్ ముస్లిం నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. ఒక ముస్లింకు హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మొత్తం సమాజానికే అధికారం ఇచ్చినట్లుగా కేసీఆర్ భావిస్తున్నారన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సీఎం, గవర్నర్ వంటి ఉన్నత పదవుల్లోనూ ముస్లింలను కాంగ్రెస్ నియమించిందన్నారు. ముస్లింలు టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. మైనారిటీలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్ మద్దతిచ్చిందన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పుడు ఒక మతతత్వ వాదిగా మారారని, ముస్లింల పేరిట ఉన్న సంస్థలు, ప్రదేశాలకు వేరే పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. టీపీసీసీ తాజా మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమ్‌కుమార్‌ను శనివారం ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్ ఏవీ డిగ్రీ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇదిలా ఉండగా.. క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను రేవంత్ రెడ్డి కలిసే కార్యక్రమానికి సోమవారం నుంచి విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి._