హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియామకమయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ జడ్జిగా ఉన్నారు. కొలీజియం సిఫారసుల మేరకు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు సీజేగా పదోన్నతి లభించింది. మరోవైపు ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.