
ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు – భారీస్థాయిలో పట్టుబడిన గంజాయి
భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్ మరియు జనగాం పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. ముఠా సభ్యుల నుండి నూమారు 12లక్షల 60వేల రూపాయల విలువగల 126 కిలోల గంజాయితో పాటు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. గుగులోత్ సుధాకర్, తండ్రి పేరు హుస్సేన్, వయస్సు 25,గుబ్బెదితాడి తందా, రాయవర్తి మండలం, వరంగల్ రూరల్ జిల్లా. 2. గుగులోత్ సురేష్, తండ్రి పేరు రవి, 19, రాందాన్ తండా, ఇల్లండ గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ రూరల్ జిల్లా, 3. టితోలియా దినేష్, తండ్రి పేరు నర్సింగ్ ప్రసాద్, వయస్సు 28, హైదరాబాద్,
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గుగులోత్ సుధాకర్ జీవనోపాధి కోసం హైదరాబాద్ లో కర్రీ పాయింట్ ఏర్పాటు చేసుకోని తన కుటుంబంతో జీవించే వాడు. ఇదే సమయంలో నిందితుడుకి వరుసకు మామా అయిన వ్యక్తి ద్వారా హైదరాబాద్లో గంజాయి అమ్మకాలు జరిపే మరో నిందితుడు టి”లియా దినేష్ తో పరిచయం అయింది. కొద్ది రోజుల క్రితం లా డౌన్ కారణంగా కర్రీ పాయింట్ వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్న నిందితుడు సుధాకరకు మరో నిందితుడు సురేష్ తో పరిచయం అయింది. మరోమారు నిందితుడు జీవనోపాధి కోసం సెకండ్స్ లో కారును కోనుగోలు చేసి కారును కిరాయిలకు తిప్పి డబ్బు సంపాదించేవాడు. కాని లాక్ డౌన్ కారణంగా కారు కుడా సరిగా కిరాయిలకు తిరగకపోవడం నిందితుడు ఆర్థికంగా ఇబ్బందులకు గురైనాడు.
దీనితో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వరుసకు మామ అయిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు సుధాకర్ అంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి మిగితా ఇద్దరు నిందితుల ద్వారా గంజాయిని ఎక్కువ మొత్తంలో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు పలుమార్లు నర్సీపట్నం నుండి తన కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలించాడు. ఇదే రీతిలో నిందితుడు మరోమారు ఈ నెల 29వ తేదిన నర్సీంపట్నంలో 126 కిలోల గంజాయిని కోనుగోలు చేసి రెండు కిలోల చొప్పున ప్యాకేట్లగా తయారు చేసి తన కారులో భద్రపర్చి సూర్యపేట మీదుగా జనగాం చేరుకున్న నిందితుడు తాను ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు మిగితా ఇద్దరు నిందితులు ఈ రోజు ఉదయం జనగాంకు చేరుకున్నారు. ప్రధాన నిందితుడు సుధాకర్ జనగాంలో వున్న మిగితా ఇద్దరు నిందితులతో కల్సి గంజాయిని తరలిస్తున్న కారులో హైదరాబాద్ కు ప్రయాణిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జనగాం ఇన్స్పెక్టర్ బాలజీవరప్రసాద్ అదేశాల మేరకు ఎస్.ఐ రవికుమార్ తన సిబ్బందితో కల్సి ఈ రోజు ఉదయం జనగాం నుండి హైదరాబాదు వెళ్ళే మార్గం పట్టుపురుగుల పెంపకం కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వస్తున్న నిందితులు ముగ్గురు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను కారులో తప్పించుకోనిపోయేందుకుగా ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆప్రమత్తమయి కారును ఆపి తనిఖీ చేయగా కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా తాము పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించడంతో నిందితుల నుండి 126 కిలోల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫో ర్స్ ఎ.సి.పి ప్రతాప కుమార్, ఇన్స్పెక్టర్ మధు, జనగాం ఇన్ స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, జనగాం ఎస్.ఐ రవికుమార్, ఎ.ఎ.ఓ సల్మాన్పషా, టాస్క్ఫ ర్స్ హెడ్ కానిస్టేబుల్ సామలింగం, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, రాజు,మీర్ మహమ్మద్ ఆలీ, రాజేష్, శ్రవణ్, చిరులను పోలీస్ కమిషనర్ అభినందించారు.*ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు – భారీస్థాయిలో పట్టుబడిన గంజాయి* *భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్ మరియు జనగాం పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. ముఠా సభ్యుల నుండి నూమారు 12లక్షల 60వేల రూపాయల విలువగల 126 కిలోల గంజాయితో పాటు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.* *పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. గుగులోత్ సుధాకర్, తండ్రి పేరు హుస్సేన్, వయస్సు 25,గుబ్బెదితాడి తందా, రాయవర్తి మండలం, వరంగల్ రూరల్ జిల్లా. 2. గుగులోత్ సురేష్, తండ్రి పేరు రవి, 19, రాందాన్ తండా, ఇల్లండ గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ రూరల్ జిల్లా, 3. టితోలియా దినేష్, తండ్రి పేరు నర్సింగ్ ప్రసాద్, వయస్సు 28, హైదరాబాద్,* ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గుగులోత్ సుధాకర్ జీవనోపాధి కోసం హైదరాబాద్ లో కర్రీ పాయింట్ ఏర్పాటు చేసుకోని తన కుటుంబంతో జీవించే వాడు. ఇదే సమయంలో నిందితుడుకి వరుసకు మామా అయిన వ్యక్తి ద్వారా హైదరాబాద్లో గంజాయి అమ్మకాలు జరిపే మరో నిందితుడు టి”లియా దినేష్ తో పరిచయం అయింది. కొద్ది రోజుల క్రితం లా డౌన్ కారణంగా కర్రీ పాయింట్ వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్న నిందితుడు సుధాకరకు మరో నిందితుడు సురేష్ తో పరిచయం అయింది. మరోమారు నిందితుడు జీవనోపాధి కోసం సెకండ్స్ లో కారును కోనుగోలు చేసి కారును కిరాయిలకు తిప్పి డబ్బు సంపాదించేవాడు. కాని లాక్ డౌన్ కారణంగా కారు కుడా సరిగా కిరాయిలకు తిరగకపోవడం నిందితుడు ఆర్థికంగా ఇబ్బందులకు గురైనాడు. దీనితో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వరుసకు మామ అయిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు సుధాకర్ అంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి మిగితా ఇద్దరు నిందితుల ద్వారా గంజాయిని ఎక్కువ మొత్తంలో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు పలుమార్లు నర్సీపట్నం నుండి తన కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలించాడు. ఇదే రీతిలో నిందితుడు మరోమారు ఈ నెల 29వ తేదిన నర్సీంపట్నంలో 126 కిలోల గంజాయిని కోనుగోలు చేసి రెండు కిలోల చొప్పున ప్యాకేట్లగా తయారు చేసి తన కారులో భద్రపర్చి సూర్యపేట మీదుగా జనగాం చేరుకున్న నిందితుడు తాను ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు మిగితా ఇద్దరు నిందితులు ఈ రోజు ఉదయం జనగాంకు చేరుకున్నారు. ప్రధాన నిందితుడు సుధాకర్ జనగాంలో వున్న మిగితా ఇద్దరు నిందితులతో కల్సి గంజాయిని తరలిస్తున్న కారులో హైదరాబాద్ కు ప్రయాణిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జనగాం ఇన్స్పెక్టర్ బాలజీవరప్రసాద్ అదేశాల మేరకు ఎస్.ఐ రవికుమార్ తన సిబ్బందితో కల్సి ఈ రోజు ఉదయం జనగాం నుండి హైదరాబాదు వెళ్ళే మార్గం పట్టుపురుగుల పెంపకం కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వస్తున్న నిందితులు ముగ్గురు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను కారులో తప్పించుకోనిపోయేందుకుగా ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆప్రమత్తమయి కారును ఆపి తనిఖీ చేయగా కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా తాము పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించడంతో నిందితుల నుండి 126 కిలోల గంజాయితో పాటు, గంజాయి రవాణాకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. *నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫో ర్స్ ఎ.సి.పి ప్రతాప కుమార్, ఇన్స్పెక్టర్ మధు, జనగాం ఇన్ స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, జనగాం ఎస్.ఐ రవికుమార్, ఎ.ఎ.ఓ సల్మాన్పషా, టాస్క్ఫ ర్స్ హెడ్ కానిస్టేబుల్ సామలింగం, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, రాజు,మీర్ మహమ్మద్ ఆలీ, రాజేష్, శ్రవణ్, చిరులను పోలీస్ కమిషనర్ అభినందించారు.*