జులై 1 నుంచి KG టు PG వరకూ ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు.
ఆ తర్వాత మాట్లాడిన ఆమె..పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లోనే క్లాసులు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
టీశాట్, దూరదర్శన్ యాప్ లో పాఠాలు ఉంచుతామన్నారు.
సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవన్నారు.
ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
జులైలో యూనివర్శిటీల వారిగా జరగాల్సిన డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు.
50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలని.. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుందని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుందన్నారు. ప్రైవేట్ స్కూళ్లు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలని.
ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలి ఆదేశించారు.జులై 1 నుంచి KG టు PG వరకూ ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆమె..పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లోనే క్లాసులు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. టీశాట్, దూరదర్శన్ యాప్ లో పాఠాలు ఉంచుతామన్నారు. సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులైలో యూనివర్శిటీల వారిగా జరగాల్సిన డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు. 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలని.. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుందని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి . ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుందన్నారు. ప్రైవేట్ స్కూళ్లు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలని. ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలి ఆదేశించారు.