అసిని తుఫానుతో ఓప్రక్క సముద్రం అల్లకల్లోలంగా ఉంటే… శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ స్వర్ణ రథం కొట్టుకొచ్చింది. దీంతో తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న విషయం తెలియగానే.. దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో చెక్కి ఉందని మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రథాన్ని స్వాధీనం చేసుకున్నారు.