అష్టదిగ్బంధనంలో నృసింహుని ఆలయం

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయం అష్టదిగ్బంధనం లో ఉంది. అమరావతి రాజధాని ఉద్యమానికి
ఆదివారం తో 600 రోజులు గడిచిన సందర్భంగా న్యాయస్దానం నుండి మంగళగిరి నృసింహుని దేవస్థానం వరకు అన్ని రాజధాని గ్రామాలను కలుపుతూ ర్యాలీ కి అమరావతి జెఎసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుండే దేవస్థానం కి వెళ్లే అన్నిమార్గాలని పోలీసులు ముళ్ళకంచలు, బారీకేడ్లతో మూసి వేశారు. దేవస్థానం వైపుగా ఎటువంటి వాహనాన్ని అనుమతించడం లేదు. దీంతో నిరసన సంగతి ఎలా ఉన్నా దూర ప్రాంతాలనుండి నృసింహుని సన్నిధికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిపోర్ట్ బై : వాసు విడేల