హైదరాబాద్: తెలంగాణను డ్రగ్స్ కు అడ్డాగా తయారు చేశారని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు వాటిని అరికట్టలేకపోతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో డ్రగ్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.కేసులో వీఐపీలు ఉంటే ఆ కేసును నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, పోలీసల దాడిలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు