టి. రమణా రెడ్డి పై నవ్వుల మాంత్రికుడు పుస్తకావిష్కరణ
ప్రముఖ హస్య నటుడు టి.రమణా రెడ్డి శత జయంతి సంధర్భంగా
మూవీ వాల్యూం సగర్వ సమర్పణ
“నవ్వుల మాంత్రికుడు”
ప్రముఖ సినీ నటుడు, ప్రముఖ మెజిషియన్ రమణారెడ్డి అభిమానులకు ఇది శుభవార్త. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రసిద్ధి గాంచిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరం ఇది.ఆణి ముత్యం లాంటి అరుదైన నటునికి ఒక కానుక ఈ పుస్తకం. ఆయన సమగ్ర జీవిత చిత్రణతో ఈ పుస్తకం సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి రానుంది. మూవీ వాల్యూమ్ మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. సీనియర్ జర్నలిస్టు, రచయిత ఉదయగిరి ఫయాజ్ ఈ పుస్తకాన్ని రచించారు. అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం అభిమానులను అలరించనుంది.