మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారికి తిరుమంజనో త్సవం, ఉదయం శ్రీవారి శాంతి కళ్యాణం, మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 గంటలకు స్వామివారి బంగారు గరుడోత్సవం, రాత్రి స్వామివారి అద్దాల మహల్ లో పవళింపు సేవ, గులాబి పూలతో సహస్రనామార్చన పూజలు జరుగుతాయని ఆయన తెలిపారు.