తుపాకితో కాల్చుకుని ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

చిత్తూరు జిల్లా ,రేణిగుంట…
బ్రేకింగ్

తుపాకితో కాల్చుకుని ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.

చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్ పి ఎఫ్ బ్యారక్ లో ఘటన .

శ్రీకాకుళం కు చెందిన ఆనందరావు (30)గా పోలీసులు గుర్తింపు.

ప్రేమించిన యువతి పెళ్లి చేసుకో బోతోందన్న బాధ…? మరోపక్క మరో ప్రక్క డ్యూటీ లో ఒత్తిడి …?

సంఘటనా స్థలానికి రేణిగుంట పోలీసులు .

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేణిగుంట సీఐ అంజు యాదవ్.

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య…..

రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బర్రాక్ నందు డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున 4:15గంటలకు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిపురం ఆనందరావు(30) ఆర్పిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా రేణిగుంట నందు విధులు నిర్వహిస్తున్నాడు ఇటీవల సొంత గ్రామానికి వెళ్లిన ఆనందరావు ఈనెల 2వ తేదీ తిరిగి డ్యూటీ కి జాయిన్ అయ్యారు ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో ఆత్మహత్య కు పాల్పడ్డాడు అధికారుల ఒత్తిడి వల్లనే…? సమాచారం అందుకున్న రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.