సున్నిపెంట సర్కిల్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఆనకట్ట వద్దకు స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద కూడా పోలీసు పహారా కొనసాగుతోంది.సున్నిపెంట సర్కిల్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా ఆనకట్ట వద్దకు స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద కూడా పోలీసు పహారా కొనసాగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద బందోబస్తు