జమ్మూ: జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా నౌషెరా ఆర్మీ క్యాంపులో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో కలిసి దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు ప్రధాని మోదీ వచ్చారు. 2014లో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోదీ నాటి నుంచి ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకునేవారు.రోమ్, యూకేలలో 5రోజులపాటు పర్యటించి కాప్ 26 వాతావరణ సదస్సులో పాల్గొని వచ్చిన మోదీ గురువారం సరిహద్దులకు వచ్చారు.ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకునే అలవాటును కొనసాగిస్తూ గురువారం ఉదయాన్నే మోదీ నౌషెరా పట్టణానికి చేరుకున్నారు.మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు