విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో అక్కల గాంధీ, మరియు పోతిన మహేష్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం

అక్కల గాంధీ పాయింట్స్

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మరియు ఏకైక నాయకుడు మరియు సీ బీ ఐ, కేసీఆర్ దత్తపుత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన పిదప
సమస్యను పక్కదారి పట్టించి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించడం దేనికి సంకేతం
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో లో పొందుపరచిన హామీలు 100% పూర్తిగా పరిష్కరిస్తే జనసేన ప్రశ్నించదు
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు దాని సంగతి ఏమైంది
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కార్మికులను మోసం చేసిన ఘనత వైసీపీ దే
రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ చార్జీలు బస్సు చార్జీలు ప్రతిదాంట్లో చార్జీల మోత మోగించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి
జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తే జనసైనికులు సహించేది లేదు
మీరు హైదరాబాదులో విద్యాభ్యాసం చేసేటప్పుడు మీరు చేసిన వ్యవహారాలు బయట పెట్టమంటారా
మీ మేనమామ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ లతో మీరేం చేశారు చెప్పమంటారా
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దోపిడీ చేసి బంగారం కంటే విలువైన వస్తువుగా మార్చేసి లక్షల మంది కార్మికుల పొట్టి కొట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఒక ముఖ్యమంత్రి లా కాకుండా ఒక నియంతలా పరిపాలిస్తున్నారు అని వైసీపీ కార్యకర్తలు సైతం వాపోతున్నారు
వైసీపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల ముందే ప్రజా వ్యతిరేకత రావడం వైసిపి పరిపాలన దక్షతకు నిదర్శనం
గడపగడపకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు

పోతిన మహేష్ కామెంట్స్…..

మత్స్యకార సభలో పాల్గొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గత కొన్ని నెలల నుండి గోదావరి జిల్లాల్లో మత్స్యకారులతో పాటు సభలు సమావేశాలు నిర్వహించడం తోనే జగన్మోహన్రెడ్డి స్పందించి మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిధులు కేటాయించడం జరిగింది
ఒక లక్ష అరవై వేల మంది కుటుంబాలు అర్హులైనప్పటికీ కేవలం లక్ష మందికి మత్స్యకార భరోసా నిధులు కేటాయించడం దేనికి నిదర్శనం
కేంద్ర ప్రభుత్వం మత్యకారులకు కేటాయిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు ప్రశ్నించిన పోతిన మహేష్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే రాష్ట్రంలో రాష్ట్రానికి నిధులు రావడం లేదు పెట్టుబడులు రావడం లేదు ఫ్యాక్టరీలు రావడం లేదని దుయ్యబట్టారు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గాల్లో అయినా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా అని ప్రశ్నించారు
మేనిఫెస్టోను దైవ గ్రంధం కంటే అత్యంత పవిత్రంగా భావిస్తారు అని చెప్పి మోసం చేసిన ఘనత కేవలం జగన్మోహన్రెడ్డి మాత్రమే దక్కుతుంది
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తారని నెపంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమానికి వెళ్ళలేని పరిస్థితి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు మద్దతుగా నరసాపురంలో సభను ఏర్పాటు చేశారు కాబట్టే ప్రభుత్వం దిగివచ్చి మత్స్యకారులను ఆదుకుంది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు వింటేనే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఓటమి ఖాయం అని వైసీపీ నాయకులకు కార్యకర్తలకు భయం పట్టుకుందని
అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకొని చూపించాలని సవాల్ చేశారు
జగన్మోహన్రెడ్డి ఒక అవకాశం ఆన్నందున ఓట్లేసిన ప్రజలు ఎన్నుకున్న కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారని తెలిపారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలపై ప్రేమ అనేది ఉంటే నిత్యావసర ధరలు తగ్గించి ఎడాపెడా వేసిన పన్నులను ఉపసంహరించుకుని ముఖ్యంగా చెత్త పన్ను ఉపసంహరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించలి
రాబోయే కాలంలో జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మరింత ఉత్సాహం తో ఉద్యమం చేస్తామని ఈ రాక్షస పాలన తుదముట్టించే వరకు పోరాడుతామని తెలిపారు