సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
విశ్వం వాయిస్ న్యూస్ కాకినాడ రూరల్ :
కాపు లకు బిసి రిజర్వేషన్లు కోరుతూ కాపు ఉద్యమంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరిస్తూ వెలువడిన ప్రకటన పట్ల రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాపులపై కేసులు రద్దు చేసి తన అభిమానాన్ని చాటు కున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం కాపు కులస్థులపై ఉద్యమ నేపథ్యంలో కేసులు బనాయించారని, కాపులపై పెట్టిన 161 కేసులు ఎత్తివేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామనీ ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.