మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ భారతక్క సైతం కరోనాతో మృతి!
అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదల
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది.
హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు.
హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమించడంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 9గంటలకు మృతి చెందాడని, భారతక్క ఈ నెల 22వ తేదీన ఉదయం 9:50గంటలకు మృతి చెందిందని లేఖలో తెలిపారు.
వీరి అంత్యక్రియలను మంగళవారం ప్రజల సమక్షంలో జరిపి, వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. దీంతోమాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ భారతక్క సైతం కరోనాతో మృతి! అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదల కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోషల్ మీడియాలో లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమించడంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 9గంటలకు మృతి చెందాడని, భారతక్క ఈ నెల 22వ తేదీన ఉదయం 9:50గంటలకు మృతి చెందిందని లేఖలో తెలిపారు. వీరి అంత్యక్రియలను మంగళవారం ప్రజల సమక్షంలో జరిపి, వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. దీంతో