నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం అమలుపై జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావే
కాకినాడ : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో తొలిదశలో 1,48,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసే క్రమంలో చేపట్టిన మెగా గ్రౌండింగ్ మేళాలో తొలిరోజు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరిగాయని, లోపాలను సవరించుకొని శని, ఆదివారాల్లో మరో 40 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మెగా గ్రౌండింగ్ మేళాపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, జేసీ (హెచ్) ఎ.భార్గవ్ తేజలతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల కీలక భాగస్వామ్యంతో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, నోడల్ అధికారులు, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేసి, పథకం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేయాలని సూచించారు. రూ.1,80,000 యూనిట్ వ్యయంతో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా రూ.50 వేల అడ్వాన్సు రుణం అందించడంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, ఆర్థిక వనరుల పరంగా లబ్ధిదారులకు మద్దతుగా నిలబడేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించాలన్నారు. మేళా సందర్భంగా చేపట్టే ఇళ్ల నిర్మాణాల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ సూచించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, మునిసిపల్ కమిషనర్లు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం అమలుపై జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం విశ్వం వాయిస్ న్యూస్ కాకినాడ ప్రతినిధి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో తొలిదశలో 1,48,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసే క్రమంలో చేపట్టిన మెగా గ్రౌండింగ్ మేళాలో తొలిరోజు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరిగాయని, లోపాలను సవరించుకొని శని, ఆదివారాల్లో మరో 40 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం మెగా గ్రౌండింగ్ మేళాపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, జేసీ (హెచ్) ఎ.భార్గవ్ తేజలతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల కీలక భాగస్వామ్యంతో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, నోడల్ అధికారులు, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేసి, పథకం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేయాలని సూచించారు. రూ.1,80,000 యూనిట్ వ్యయంతో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా రూ.50 వేల అడ్వాన్సు రుణం అందించడంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, ఆర్థిక వనరుల పరంగా లబ్ధిదారులకు మద్దతుగా నిలబడేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించాలన్నారు. మేళా సందర్భంగా చేపట్టే ఇళ్ల నిర్మాణాల సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ సూచించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, మునిసిపల్ కమిషనర్లు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.