అధికారంలోకి తేవడానికే కాంగ్రెస్‌లో చేరాం: ఎమ్మెల్యే సీతక్క
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని ఆమె అన్నారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని ఆమె పేర్కొన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ హడావుడి మీటింగ్‌లు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తిరిగి గుంజుకున్నారని సీతక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్క దారి పట్టించారని ఆరోపించారు. గిరిజనులకు సీఎం అన్యాయం చేస్తున్నారన్నారు. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని సీతక్క పేర్కొన్నారు.. కేపి*అధికారంలోకి తేవడానికే కాంగ్రెస్‌లో చేరాం: ఎమ్మెల్యే సీతక్క* హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని ఆమె అన్నారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని ఆమె పేర్కొన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ హడావుడి మీటింగ్‌లు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తిరిగి గుంజుకున్నారని సీతక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్క దారి పట్టించారని ఆరోపించారు. గిరిజనులకు సీఎం అన్యాయం చేస్తున్నారన్నారు. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని సీతక్క పేర్కొన్నారు.. కేపి