భట్టి విక్రమార్కకు డిల్లీ నుండి హైకమాండ్ పిలుపు
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక తరువాత కాంగ్రెస్‌లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డిని హైకమాండ్ టీపీసీసీ చీఫ్‌గా నియమించడంపై మరో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని తీవ్రస్థాయిలోనే వ్యక్తం చేశారు. మరికొందరు సీనియర్లు ఈ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో వారి ఆలోచన ఏమిటనేది ఎవరికీ అర్థంకావడం లేదు. అలాంటి నేతల జాబితాలో భట్టి విక్రమార్క కూడా ఒకరు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపికపై భట్టి మౌనంగా ఉన్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన భట్టి విక్రమార్క విజ్ఞప్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
దీంతో భట్టి విక్రమార్క టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం.. ఆయన హుటాహుటిన ఢిల్లీ విమానం ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో భట్టి ఎవరిని కలుస్తారా ? వాళ్లు ఆయనకు ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఢిల్లీ పెద్దలు భట్టికి నచ్చజెబుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్కకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు ఆయనను హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా ఆపేందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచి ఉండవచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి.
కొందరైతే భట్టి విక్రమార్క తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచి అధిష్టానం బుజ్జగిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి భట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనే అంశాన్ని బట్టే.. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు హస్తినకు పిలిచిందనే విషయం తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు*భట్టి విక్రమార్కకు డిల్లీ నుండి హైకమాండ్ పిలుపు* తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక తరువాత కాంగ్రెస్‌లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డిని హైకమాండ్ టీపీసీసీ చీఫ్‌గా నియమించడంపై మరో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని తీవ్రస్థాయిలోనే వ్యక్తం చేశారు. మరికొందరు సీనియర్లు ఈ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డికి మద్దతు తెలపకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో వారి ఆలోచన ఏమిటనేది ఎవరికీ అర్థంకావడం లేదు. అలాంటి నేతల జాబితాలో భట్టి విక్రమార్క కూడా ఒకరు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపికపై భట్టి మౌనంగా ఉన్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన భట్టి విక్రమార్క విజ్ఞప్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో భట్టి విక్రమార్క టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపు రావడం.. ఆయన హుటాహుటిన ఢిల్లీ విమానం ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో భట్టి ఎవరిని కలుస్తారా ? వాళ్లు ఆయనకు ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఢిల్లీ పెద్దలు భట్టికి నచ్చజెబుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్కకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు ఆయనను హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా ఆపేందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచి ఉండవచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. కొందరైతే భట్టి విక్రమార్క తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచి అధిష్టానం బుజ్జగిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి భట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనే అంశాన్ని బట్టే.. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు హస్తినకు పిలిచిందనే విషయం తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు