రానున్న మూడు రోజుల వరకు రాయలసీమ జిల్లాల్లోని చాలా భాగాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో నుంచి ప్రస్తుతానికి అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం నేరుగా కేరళ తీరాన్ని తాకి ఆ తర్వాత భూపిలోకి ప్రవేశించి రేపటి సాయంకాలం లోపల రాయలసీమ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల పైన భారీ ప్రభావాన్ని చూపనుంది. ఇలా రుతుపవనాల సమయంలో కూడ ఏర్పడదు, కానీ ఈ ఎండా కాలంలో ఏర్పడ్డం చాలా చాలా అరుదు.

రానున్న మూడు రోజులు (17, 18, 19) రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అత్యధికంగా అనంతపురం, సత్యసాయి (పుట్టపర్తి), చిత్తూరు జిల్లాల్లో వర్షాపాతం నమోదవ్వనుంది. కర్నూలు, నంధ్యాల​, కడప​, తిరుపతి, నెల్లూరు పశ్చిమ భాగాలు, ప్రకాశం పశ్చిమ భాగాలు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా – గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తెలంగాణ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు. మరో వైపున విశాఖ ఏజెన్సీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదవ్వనుంది.