హైదరాబాద్ : సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలి. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలే పీడిత వర్గాలు అన్నారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లేందుకు ఏం చేయాలో సూచనలు చేయాలన్నారు.
దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామని చెప్పారు. నిధుల బాధ్యత తనదని తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత తామంతా తీసుకుందామన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అన్న సీఎం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. అందుకు పాలకులే బాధ్యులు అవుతారని పేర్కొన్నారు.హైదరాబాద్ : సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలి. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలే పీడిత వర్గాలు అన్నారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లేందుకు ఏం చేయాలో సూచనలు చేయాలన్నారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామని చెప్పారు. నిధుల బాధ్యత తనదని తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత తామంతా తీసుకుందామన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అన్న సీఎం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. అందుకు పాలకులే బాధ్యులు అవుతారని పేర్కొన్నారు.