తూర్పుగోదావరి జిల్లా
రాజమహేంద్రవరం పుష్ప ఘాట్ వద్ద సుమారు 56 అడుగులకి చేరుకున్న నీటిమట్టం
కోటిలింగాల ఘాట్ శంకర్ ఘాట్ దుర్గా ఘాట్ గణపతి ఘాట్ మార్కండేయ
ఘాట్
కుమారిఘాట్ ఇస్కాన్ ఘాట్ గాయత్రి ఘాట్ విఐపి ఘాట్ అన్ని ఘాట్ లో పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు
గోదావరి నదికి లంక భూముల్లో నివాసం ఉండి జీవనం సాగించే చాపలు వేటగాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది
గంట గంటకు గోదావరి కి పెరుగుతున్న వరద ఉధృతి
కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో నీట మునిగిన ఆలయాలు
వరద ప్రభావం పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ మాధవిలత
భక్తులను స్థాన ఘట్టాల్లో నదీ పరివాహ ప్రాంతాల్లో దిగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు
గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ముఖ్య ఘాట్ లను, ధవలేశ్వరం కాటన్ బ్యారేజి ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, IPS.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతు మూడోవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నా నేపథ్యంలో, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, IPS., వారు గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి, సామాన్య ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించి, నదీ పరివాహక ప్రాంతాలలో మరియు గోదావరి లంకలలో నివసించే ప్రజల రక్షణ దృశ్య ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తును ఏర్పాటు చేసి, జిల్లా నందు ముఖ్య ఘాట్ లను, పుష్కర ఘాట్, దవిళేశ్వరం కాటన్ బ్యారేజి ను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించిన పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టవలసిన/తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ తగు సూచనలు/ఆదేశాలను జారీ చేసి అప్రమత్తం చేసినారు.