రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధిగా వ్యయం చేసేందుకు ప్రతి రాష్ట్ర మంత్రికి రెండు కోట్లు, ప్రతి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయలను కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన అన్నారు. పల్లెలు, పట్టణాల రూపు రేఖలు మార్చాలని , కనీస వసతులు సదుపాయాలు కల్పించాలని, ప్రతి గ్రామం, పట్టణం శుభ్రంగా , పచ్చదనంతో అహ్లాదంతో వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ ముందు చూపుతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని, రాబోయే రోజుల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా మారుతుందని ఆయన అన్నారు. పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులనైనా వెచ్చించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధిగా వ్యయం చేసేందుకు ప్రతి రాష్ట్ర మంత్రికి రెండు కోట్లు, ప్రతి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయలను కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన అన్నారు. పల్లెలు, పట్టణాల రూపు రేఖలు మార్చాలని , కనీస వసతులు సదుపాయాలు కల్పించాలని, ప్రతి గ్రామం, పట్టణం శుభ్రంగా , పచ్చదనంతో అహ్లాదంతో వెల్లివిరియాలని సీఎం కేసీఆర్ ముందు చూపుతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని, రాబోయే రోజుల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా మారుతుందని ఆయన అన్నారు. పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులనైనా వెచ్చించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎర్రబెల్లి దయాకర్