యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రం ఈద్గా ముస్లింల రంజాన్ వేడుకలల్లో ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదర సోదరీ మణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశంలో భయానక బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఈ బుల్డోజర్ పాలిటిక్స్ దేశంలో సుమారు 30 కోట్ల మంది ముస్లిం సోదరుల కుటుంబాలను బాధించే విధంగా ఉన్నాయని,

భారత దేశం ఒక సర్వమత సెక్యులర్ దేశంగా నిలిచిన గొప్ప దేశం కానీ కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సోదరుల కుటుంబాలే లక్ష్యంగా బుల్డోజర్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది అని ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మైనారిటీ కులాల పై కూడా బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తాయనీ దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు.

రంజాన్ పండుగ సందర్భంగా అల్లాను నేను కోరుకునేది దేశం అంతా సర్వమతాల సమ్మేళనంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తు అందరూ సోదర భావంతో పండుగను జరుపుకోవాలని కోరారు