బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌ట్టింగ్ చేసిందేవ‌రో తెలుసా?

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌ట్టింగ్ చేసిందేవ‌రో తెలుసా?

హైద‌రాబాద్ : బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్క‌రించింది. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్.. కూలీల ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న గౌర‌వాన్ని చాటిచెప్పారు. ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్‌ను ఓ కూలీతో చేయించారు. ఆ కూలీ ఎవ‌రో కాదు.. మ‌న వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన శివ‌మ్మ‌. ఆమె గ‌త రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. శివ‌మ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డంతో అంద‌రూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌ట్టింగ్ చేసిందేవ‌రో తెలుసా?
ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ల‌క్ష‌లాది మంది కార్మికులు మ‌న ప్రాజెక్టుల్లో నిమ‌గ్న‌మై ప‌ని చేశారు. వారిని గౌర‌వించుకోవాల‌నే సీఎం కేసీఆర్ సూచ‌న‌తో.. వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన‌ శివ‌మ్మ అనే కూలీతో ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్ చేయించామ‌ని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధిలో పాలు పంచుకునే కూలీల‌ను గౌర‌వించుకుంటామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.