19వ తేదీ – వనపర్తి జిల్లా పర్యటన:
ఆదివారం, 19వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

20వ తేదీ – జనగామ జిల్లా పర్యటన:
సోమవారం, 20వ తేదీన జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం శ్రీ కేసీఆర్ ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

వీటితో పాటు సీఎం త్వరలోనే మరికొన్ని జిల్లాలు నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. జిల్లాల పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి.

ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపట్టనున్నారు. ఆ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 100 పడకల దవాఖానను ప్రారంభించనున్నారు.

నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.