
మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న పోషక్ ఫుడ్ కంపెనీ లో రణ్ వీర్ సింగ్ (41) సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ఆఫీసు పని నిమిత్తం రణ్ వీర్ సింగ్ కాటేదాన్ లో ఉన్న పోషక్ ఫుడ్ నుంచి పుష్టి ఫుడ్ కంపెనీ వైపు తన హోండా యాక్టివా బైక్ పై నగదు బ్యాగ్ (రూ.6,03,000 )తో బయలుదేరగా మార్గమధ్యలో బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించాడు. ఎంత వెతికినా దొరకకపోవడం తో మైలార్ దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో వైపు తాను వెళ్తున్న మార్గంలో బ్యాగ్ కనిపించడంతో అశోక్ తివారీ (29) తన యజమాని (మిత్రా పాలిమర్స్) రఘుబీర్ సింగ్ కు సమాచారం ఇచ్చాడు. యజమాని సూచనల మేరకు వారు ఇరువురు బ్యాగ్ ను పోలీసులకు అప్పగించారు.
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ విజిట్ లో ఉన్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., విషయం తెలుసుకొని రన్వీర్ సింగ్ కు తాను పోగొట్టుకున్న నగదును అప్పగించడంతో పాటు దొరికిన నగదు బ్యాగ్ ను నిజాయితీగా పోలీసులకు అప్పగించిన అశోక్ తివారీ, రఘుబీర్ సింగ్ సీపీ అభినందించారు. వీరికి తగు రివార్డును అందజేస్తామన్నారు.