అంబేద్కర్ సెంటర్ వద్ద బీజేపీ నేతల ఆందోళన

ఖమ్మం : బీజేపీ పోలీసుల తీరును నిరసిస్తూ ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మంగళవారం బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆనంతు ఉపేందర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు . దీంతో అక్కడ పోలీసులు , కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది . నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధంకు తెరాసకు పోలీసులు అనుమతి ఇచ్చారు . బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు మంత్రి అజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకుని బీజేపీ వారిని అరెస్టు చేయడమేంటని ఆందోళన వ్యక్తం చేశారు . పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని
ఆరోపించారు . బిజెపి కార్యకర్తలకు , పోలీసులకు మధ్య వాగ్వాదం , తోపులాట జరిగింది . ఉద్రిక్తత మధ్య మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మను దహనం చేసారు .