అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ములారెడ్డి నీ పరామర్శించిన చంద్రబాబు నాయుడు

అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, రాజకీయ దురంధరుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి గారిని పరామర్శిoచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానించారు.

అనంతరం మూలారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి భరోసానిచ్చారు.

అనంతరం మూలారెడ్డి గారితో పని చేసిన రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు.