తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది.ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రభావంతోనే సౌత్ ఆఫ్రికా, యూకే తదితర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగాయని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో మన దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ నొక్కి చెప్పింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్టింగ్ కిట్లను సప్లై చేసింది. తీవ్రతను బట్టి కట్టడి చర్యలను స్పీడప్చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కూడా ప్రభుత్వం బీఏ 4 అలెర్ట్ ఇచ్చింది. సౌతాఫ్రికా, యూకే దేశాల నుంచి వచ్చినోళ్లను అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ లేనందున క్వారంటైన్, నెగిటివ్ ఎంట్రీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే బీఏ4 వేరియంట్ ఇంతకు ముందు వచ్చినోళ్లకు, వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేయడం ఆందోళనకరం. అయితే సివియారిటీ పరిస్థితులు రావని చెప్పడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
హైదరాబాద్ వ్యక్తికి సోకలేదు: హెల్త్ డైరెక్టర్డా జీ శ్రీనివాసరావు
కరోనా కొత్త వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేదు. అయితే హైదరాబాద్‌లోని వ్యక్తికి బీఏ 4 సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ వ్యక్తి దక్షిణా ఆఫ్రికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఓ సమావేశానికి హాజరై వెళ్లిపోయాడు. ఈ సమావేశంలో 24 మంది పాల్గొనగా, వారందరినీ గుర్తించి టెస్టులు చేశాం. అందరికీ నెగిటివ్ వచ్చింది. కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో కూడా ఉంచాం. ఇదంతా పది రోజుల క్రితం జరిగింది. అనవసరంగా తప్పుడు వార్తలు క్రియేట్ చేసి జనాలను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదు. మరోవైపు చాలా మంది బూస్టర్ డోసుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే వైరస్ పూర్తిగా నియంత్రణలో ఉంది. కానీ కొత్త వేరియంట్లు వ్యాప్తి కి చెక్ పెట్టేందుకు మరో ఏడాది పాటు బూస్టర్ వ్యాక్సిన్లు అవసరం.