జ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు
హైదరాబాద్: నాగోలులోని జ్యోతిష్యుడి ఇంట్లో రంగురాళ్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. రంగురాళ్లతో పాటు కొంత నగదు చోరీ అయ్యాయని బెల్లంకొండ మురళీకృష్ణశర్మ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా… పోలీసులు జరిపిన విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుచూశాయి. మురళీకృష్ణ శర్మ ఇంట్లో పోలీసులు భారీగా నగదు గుర్తించారు. దాదాపు రూ.18కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ.6లక్షల నగదు లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. మురళీకృష్ణశర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని గుర్తించిన పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేపట్టారు.
జ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు
ఈ కేసుకు సంబంధించి చోరీకి పాల్పడిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము చోరీ చేసిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించామని, ఆతర్వాత వాటిని తగులబెట్టామని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నకిలీ నోట్లు ఇంట్లోకి ఎలా వచ్చాయనే దానిపై.. ఫిర్యాదుదారు మురళీకృష్ణ శర్మను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు వ్యవహారం వెలుగు చూసిందిజ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు హైదరాబాద్: నాగోలులోని జ్యోతిష్యుడి ఇంట్లో రంగురాళ్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. రంగురాళ్లతో పాటు కొంత నగదు చోరీ అయ్యాయని బెల్లంకొండ మురళీకృష్ణశర్మ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా… పోలీసులు జరిపిన విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుచూశాయి. మురళీకృష్ణ శర్మ ఇంట్లో పోలీసులు భారీగా నగదు గుర్తించారు. దాదాపు రూ.18కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ.6లక్షల నగదు లభ్యమైనట్టు పోలీసులు వెల్లడించారు. మురళీకృష్ణశర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని గుర్తించిన పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేపట్టారు. జ్యోతిష్యుడి ఇంట్లో నకిలీ నోట్ల కట్టలు ఈ కేసుకు సంబంధించి చోరీకి పాల్పడిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము చోరీ చేసిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించామని, ఆతర్వాత వాటిని తగులబెట్టామని పోలీసుల దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నకిలీ నోట్లు ఇంట్లోకి ఎలా వచ్చాయనే దానిపై.. ఫిర్యాదుదారు మురళీకృష్ణ శర్మను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు వ్యవహారం వెలుగు చూసింది