రెండు జాతీయ రహదారులు కలిసే వంగపల్లి వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నేడు న్యూఢిల్లీలో నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల సెక్రెటరీ గిరిధర్ ఆర్మనేను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారి నెం 163 మరియు జాతీయ రహదారి నెం. 65 వంగపల్లి మీదుగా వెళుతున్నట్లు తెలిపారు. ఎన్‌హెచ్ఏఐ ఇక్కడ ప్రాంతాన్ని జంక్షన్ గా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించిందన్నారు. కానీ చాలాకాలంగా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి కావాలని స్థానికులు కోరుతున్నారని లేఖలో వివరించారు.
ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తే రవాణాకు ఇబ్బందులు తప్పడంతో పాటు ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అలాగే చౌటుప్పల్, టేకుమడ్ల వద్ద సైతం వియూపీ నిర్మించాలని కోరారు.