మంగళగిరి లో విరిగిపడిన ధ్వజస్తంభం

మంగళగిరి లో విరిగిపడిన ధ్వజస్తంభం

మంగళగిరి మండలం ఆత్మకూరు లోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం (శివాలయం) లోని 50 అడుగులు ధ్వజస్తంభం సోమవారం సాయంత్రం విరిగిపడింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.

ఆలయ కార్య నిర్వాహణాధికారి జే వి నారాయణ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలు క్రితం దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు చెప్పారు.

ఎలాంటి ఈదురుగాలులు లేకపోయినప్పటికీ మధ్యకు విరిగి ఆలయ ముఖ మండపం పై పడినట్లు తెలిపారు. ధ్వజస్తంభానికి చెదలు పట్టడంతో ఈ ఘటన జరిగిందని, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.మంగళగిరి మండలం ఆత్మకూరు లోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం (శివాలయం) లోని 50 అడుగులు ధ్వజస్తంభం సోమవారం సాయంత్రం విరిగిపడింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి జే వి నారాయణ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలు క్రితం దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు చెప్పారు. ఎలాంటి ఈదురుగాలులు లేకపోయినప్పటికీ మధ్యకు విరిగి ఆలయ ముఖ మండపం పై పడినట్లు తెలిపారు. ధ్వజస్తంభానికి చెదలు పట్టడంతో ఈ ఘటన జరిగిందని, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.