భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కాశ్మీర్ ప్రాంతంలో కూలిపోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో తులైల్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం హెలికాప్టర్ కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్, కో-పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి వెళ్లిందని, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని, దీంతో తాము తదుపరి చర్యలు తీసుకున్నామని స్థానిక సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారి చెప్పారు