రోడ్డుప్రమాదంలో వినుకొండ ఆంధ్రపత్రిక విలేకరి దుర్మరణం
రోడ్డుప్రమాదంలో వినుకొండ ఆంధ్రపత్రిక విలేకరి దుర్మరణం
యడ్లపాడు మండలపరిధిలోని వంకాయలపాడు జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో వినుకొండ ఆంధ్ర పత్రిక విలేకరి జయవరపు వెంకటసుబ్రమణ్య పురుషోత్తమ కుమార్ దుర్మరణం పాలయ్యారు. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగివుంటుందని భావిస్తున్నారు. స్థానికులు తెలుపుతున్న వివరాలప్రకారం గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వెళుతున్న లారీ ని వెనకనుండి అతివేగంగా మృతుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని,కారులోప్రయాణిస్తున్న కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. కారు డ్రైవర్ కు చిన్నపాటి దెబ్బలు తగిలాయని తెలిపారు. అతనిని 108 వాహనంలో చిలకలూరిపేట తీసుకువెళ్లినట్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.