ఫ్యాషన్ కు తగ్గా ఆభరణాల అలంకరణ మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని టాలివుడ్ సినీతార, బిగ్ బాగ్ ఫేమ్ హిమజా అన్నారు. జూబ్హిహిల్స్ రోడ్ 36లో గల పి.బి.యన్ స్క్వేర్ లో ఏర్పాటైన కర్ణిక జ్యూవెల్స్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి హిమజా మాట్లాడుతూ సిల్వర్ జ్యూవెలరీ , గో్ల్డ్ ప్లేటెడ్ జ్యూవేలరికీ ఎంతో ఆదరణ పెరుగుతుందని, దుస్తులకు తగ్గా డిజైన్లతో జ్యూవెలరీ లభించడమే ప్రత్యేకత అని అన్నారు. తాను కూడా ఈ తరహా జ్యూవెలరీ ధరించడానికి మక్కువ చూపుతుతానని అన్నారు. కర్ణిక జ్యూవెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి మాట్లాడూతూ విభిన్నమైన డిజైన్స్ లో నాణ్యమైన సమకాలీన ఫ్యాషన్ వెరైటీస్ తప్పా, ఫ్యూషన్, హ్యాండ్ మేడ్ నక్షి జ్యూవెలరీతో పాటు నవరతన్ , స్వరోక్సి వంటి నెక్లెస్ ఆభరణాలకు ప్రత్యేక శైలి ఉంటుందని తెలిపారు.