తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 6,17,776కి చేరుకోగా, కరోనా వైరస్‌తో 3,607 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 16,030 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5,98,139 మంది రికవరీ అయ్యారు.