‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది పంజాబీ భామ ‘పాయల్ రాజపుత్’. ఇటీవల విడుదలైన ‘తీస్ మార్ ఖాన్ ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది..తాజాగా డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న “జిన్నా” చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించే అనూప్ రూబెన్స్, నాటు నాటు’ ఫేమ్.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ. రెండు సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ లాంటి బడా సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న “జిన్నా” సినిమాకు రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదానికి Rx 100 సినిమా ఉదాహరణ. కోటి నుంచి రెండు కోట్లు పెట్టి సినిమా తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో రా & రఫ్ క్యారెక్టర్ లో మేకప్ లేకుండా నటించాను.ఆ సినిమా తరువాత నా మేనేజర్ తో పాటు కొంతమంది నాకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో నా కొచ్చిన సినిమా స్క్రిప్ట్ కూడా వినకుండా వచ్చిన సినిమాలన్నీ చేశాను ఆ తరువాత మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తే నేమ్, ఫేమ్ వస్తాయని తెలుసుకొని ఇప్పుడు స్క్రిప్ట్స్ వింటున్నాను.నాకు నచ్చితేనే సినిమా చేస్తున్నాను.
లాక్ డౌన్ టైమ్ లో నేను చాలా స్ట్రగుల్ ఫెస్ చేశాను . నాకు దగ్గరైన వ్యక్తిని కోల్పోయాను లైఫ్ అంటే ఏంటి అనేది దాని నుంచి చాలా నేర్చుకున్నాను. జిన్నా విషయానికి వస్తే నాకు మోహన్ బాబు సార్ గారు ఫోన్ చేసి “అనగనగా ఓ అతిథి” సినిమాలో చాలా మెచ్యూరిటీ గా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశావు అనడం చాలా గ్రేట్ గా ఫీలయ్యాను.నిజం చెప్పాలంటే ఆ సినిమా నాకు ఒక యాక్ట్రెస్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు జిన్నా ప్రాజెక్ట్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇలా “జిన్నా” లో నటించే అవకాశం రావడానికి ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ యూనిక్ గా విలేజ్ గర్ల్ గా స్వాతి పాత్రలో పికిల్స్ అమ్మే అమ్మాయి గా నటిస్తున్నాను. ఇది పక్కా పైసా వసూల్ అయ్యే మాస్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ.విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. తను చాలా ఎనర్జిటిక్, హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే కోన గారితో, చోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా అందరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను.
దర్శకుడు సూర్య గారితో వర్క్ చేయడం ఇదే మొదటి సారి తన వర్క్ కు నేను బిగ్ ఫ్యాన్ అయ్యాను..ఎక్స్ప్రెషన్స్ విషయంలో, కానీ నటనలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి దానికి సీరియస్ గా తీసుకుని మా దగ్గరనుండి చక్కని నటనను రాబట్టుకుంటాడు.ఈ సినిమా మాకు ఒక ఇన్స్టిట్యూట్ లా చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్షన్ రొమాంటిక్ కామెడీ గా వస్తున్న ఈ సినిమాలో మంచి కథతో పాటు మంచి విజువల్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఆడియన్స్ అందరూ లెక్కలు వేసుకొని థియేటర్స్ కు వస్తున్నారు. థియేటర్ కు పెట్టే టికెట్ తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడచ్చు అనే బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తూ ఓటీటీ కి అలవాటు పడుతున్నారు. సినిమా అద్భుతంగా మంచి కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఆలా మంచి కంటెంట్ తో వచ్చిన Rx 100 సినిమా లో నటించడం నా కిస్మత్ అనుకుంటా ఎందుకంటే నాకు ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.
ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ రెడీ గా ఉన్నాయి.ఇందులో కన్నడ “హెడ్ బుష్” అనే బిగ్ మూవీ చేస్తున్నాను.ఇది అండర్ వరల్డ్ డాన్ బయోపిక్ .,ఇంకొకటి మీటూ మాయా పేటిక ఇందులో ఐదు స్టోరీస్ ఉంటాయి.ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. ఇందులో నా పాత్ర బాగుంటుంది. తమిళ్ లో గోల్ మాల్ సినిమా చేస్తున్నాను ఇది “దే దనాదన్” కి రీమేక్ ఇందులో జీవా నటిస్తున్నాడు. ఇంకొక సినిమా కథ చర్చల్లో ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “జిన్నా” చిత్రం రెగ్యులర్ రొటీన్ లా మాత్రం ఉండదు చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ముగించారు.
నటీ నటులు
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్