కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
”’అడవి అన్నాక పులి సింహం చిరుత అన్నీ వేటకు వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోగ సూర్యాస్తమయం ఐతే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను” కమల్ హాసన్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
”నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో పని లేదు. నా గవర్నమెంట్ ని నేను తయారు చేసుకోగలను”అనే డైలాగ్ తో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. ట్రైలర్ లో ఫహద్ ఫాసిల్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్ వుంది. చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా గ్రాండ్ వున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ నిండిన 2నిమిషాల 38సెకన్ల నిడివి గల విక్రమ్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది.
కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ తో పాటు సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు.
టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తుంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు.
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్