వరుస రీమేక్స్ తో సందడి చేస్తున్న అగ్ర నిర్మాత !
ప్రస్తుతం వరుస రీమేక్ సినిమాలతో బాలీవుడ్ సందడి చేస్తున్నాడు దిల్ రాజు. వరుసగా మూడు ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ తో కలిసి షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్న దిల్ రాజు తెలుగులో సూపర్ హిట్టైన ‘హిట్’ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నాడు.ఈ రెండితో పాటు మారో రీమేక్ కూడా ఫైనల్ చేసుకున్నాడు. ఇటివలే అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘నాంది’ మంచి విజయంతో ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడా సినిమాను హిందీలో అజయ్ దేవగన్ తో కలిసి నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు.
ఇటివలే నాంది హిందీ రీమేక్ సినిమాను అఫీషియల్ ఎనౌన్స్ చేశారు రాజు. అయితే అజయ్ దేవగన్ ఈ సినిమాలో హీరోగా కాకుండా కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారు. అల్లరి నరేష్ పాత్రను అక్కడ ఎవరైనా యువ హీరోతో చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే హీరో మిగతా కాస్టింగ్ పై డిస్కషన్ నడుస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ని కూడా త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు.
ఇక ఈ మూడు రీమేక్ సినిమాలతో పాటు ‘F2’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ సినిమాను బోణీ కపూర్ తో కలిసి నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దిల్ రాజు. ఆ రీమేక్ కి సంబంధించి కూడా త్వరలోనే అప్ డేట్ రానుంది. ఇలా వరుసా రీమేక్ సినిమాలతో బాలీవుడ్ లో హంగామా చేయబోతున్న దిల్ రాజు అక్కడ నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.వరుస రీమేక్స్ తో సందడి చేస్తున్న అగ్ర నిర్మాత ! ప్రస్తుతం వరుస రీమేక్ సినిమాలతో బాలీవుడ్ సందడి చేస్తున్నాడు దిల్ రాజు. వరుసగా మూడు ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ తో కలిసి షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్న దిల్ రాజు తెలుగులో సూపర్ హిట్టైన ‘హిట్’ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నాడు.ఈ రెండితో పాటు మారో రీమేక్ కూడా ఫైనల్ చేసుకున్నాడు. ఇటివలే అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘నాంది’ మంచి విజయంతో ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడా సినిమాను హిందీలో అజయ్ దేవగన్ తో కలిసి నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు దిల్ రాజు. ఇటివలే నాంది హిందీ రీమేక్ సినిమాను అఫీషియల్ ఎనౌన్స్ చేశారు రాజు. అయితే అజయ్ దేవగన్ ఈ సినిమాలో హీరోగా కాకుండా కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారు. అల్లరి నరేష్ పాత్రను అక్కడ ఎవరైనా యువ హీరోతో చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే హీరో మిగతా కాస్టింగ్ పై డిస్కషన్ నడుస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ని కూడా త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు. ఇక ఈ మూడు రీమేక్ సినిమాలతో పాటు ‘F2’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ సినిమాను బోణీ కపూర్ తో కలిసి నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దిల్ రాజు. ఆ రీమేక్ కి సంబంధించి కూడా త్వరలోనే అప్ డేట్ రానుంది. ఇలా వరుసా రీమేక్ సినిమాలతో బాలీవుడ్ లో హంగామా చేయబోతున్న దిల్ రాజు అక్కడ నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి..