బ‌ల‌మెవ్వ‌డు` నుంచి మెలోడి సాంగ్ `మౌన‌మా ఓడిపో...` విడుద‌ల‌

మౌన‌మా ఓడిపో.. ఓన‌మాలాట‌లోదూర‌మా చేరిపో.. చేతుల గీత‌లో“ అని ప్రేయ‌సి ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ గురించి త‌పిస్తుంటే…
బ‌త‌కు బ‌డి ప్రేమ‌గా బ‌డి ప‌లుకు రాసుకోనిచ్చెలి ముచ్చ‌టె దాచుకోగా.. “ అంటూ ప్రేమికుడు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు. 
అస‌లు ప్రేమికుడు, ప్రేయ‌సి ఎవ‌రు?  వారి మ‌ధ్య ప్రేమ ఎందుకు.. ఎలా పుట్టింది?  అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం `బ‌ల‌మెవ్వ‌డు` సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ఈసినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను లిరిక‌ల్ వీడియో పాట‌గా చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేశారు. క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి రాసిన ఈ పాట‌ను, అనురాగ్ కుల‌క‌ర్ణి, సాహితి చాగంటి పాడారు. 
మెలోడీ సాంగ్స్‌కు ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసి మెలోడి బ్ర‌హ్మ అనే పేరుని త‌న పేరు ముందు చేర్చుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీత సార‌థ్యాన్ని వహిస్తున్నారు. 
ఇటీవ‌ల విడుద‌లైన కాన్సెప్ట్ టీజ‌ర్‌కు, మ‌ర‌క‌త మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి పాడిన టైటిల్ సాంగ్‌.. `బ‌ల‌మెవ్వ‌డు`కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత ఆర్‌.బి.మార్కండేయులు తెలిపారు. 
నటీనటులు : ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ  డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్
సాంకేతిక నిపుణులు : ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  స‌త్య రాచ‌కొండ‌నిర్మాత‌: ఆర్‌.బి.మార్కండేయులుఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ధృవ‌న్ క‌ట‌కంసంగీతం:  మ‌ణిశ‌ర్మ‌సినిమాటోగ్ర‌ఫీ:  సంతోశ్ శ‌క్తి, గిరి.పిఎడిట‌ర్‌:  జెస్విన్ ప్ర‌భుఫైట్స్‌:  శివ‌రాజ్‌కాస్ట్యూమ్స్‌:  హ‌రీషా రాచ‌కొండ‌పాట‌లు: క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి