‘ఆహా’లో అక్టోబర్ 24న ‘స్వాతి ముత్యం’
పండుగ నెల వచ్చేసింది. అందులో దీపావళి ఫెస్టివల్ సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్న మన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి సిద్ధమైంది. అందులో భాగంగా ‘స్వాతి ముత్యం’ సినిమాను ప్రేక్షకులకు అందించనుంది. వెరైటీ ఆఫ్ కంటెంట్‌కు ఆహా వన్ స్టాఫ్‌గా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీస్, షోస్, వెబ్ సిరీస్, ఇతర భాషల నుంచి అనువదించబడ్డ సూపర్ హిట్ కంటెంట్‌లతో తెలుగు ఆడియెన్స్‌ను నిరంతరం ఎంటర్‌టైన్మెంట్‌లో ముంచెత్తుతోంది ఆహా. ఈ లిస్టులో ఇప్పుడు అక్టోబర్ 24న ‘స్వాతి ముత్యం’ సినిమా కూడా చేరనుంది. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, సీనియర్ తదితరులు ఇది వరకెన్నడూ లేనంతగా ఆహా ఆడియెన్స్‌ని అలరించటానికి సిద్ధమయ్యారు. స్వాతి ముత్యం సినిమా కథ విషయానికి వస్తే.. ఇది బాల మురళీ కృష్ణ అలియాస్ బాల (గణేష్ బెల్లంకొండ) చుట్టూ తిరుగుతుంది. పసిపిల్లాడిలాంటి స్వచ్ఛమైన మనసున్న బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. అతని తల్లిదండ్రులు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు. ఆ క్రమంలో తాను సంబంధం చూడటానికి వెళ్లిన అమ్మాయి భాగ్యలక్ష్మి అలియాస్ భాగి (వర్ష బొల్లమ్మ)తో తను ప్రేమలో పడిపోతాడు. వారిద్దరికీ పెళ్లి కుదురుతుంది. పెళ్లి రోజున బాలకి అనుకోకుండా ఓ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. దాంతో అతను ఏం చేయాలో తెలియని గందరగోళంలో పడిపోతాడు. జరగాల్సిన పెళ్లి ఆగిపోతుంది. మరి బాల తన సమస్యను పరిష్కరించుకున్నాడా, భాగ్యను పెళ్లి చేసుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం అక్టోబర్ 24న ఆహాలో రానున్న స్వాతి ముత్యం సినిమా చూడాల్సిందే. ఈ అందమైన ప్రేమ కథను లక్ష్మణ్ కె.కృష్ణ డైరెక్ట్ చేశారు. మంచి ట్విస్టులతో ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామాలో సరోగసీ అనే పాయింట్ గురించి ప్రస్తావించారు. మంచి భావోద్వేగాలు, హాస్యంతో సినిమా ఆసాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.