సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సెన్సార్ పూర్తి
హీరో సుశాంత్ తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సినిమా విడుదల తేది దగ్గరవుతుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను ఎక్కువగా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొంది ఆగస్ట్ 27న సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఫ్రెష్ కంటెంట్, యాక్షన్, రొమాన్స్ సహా ఇతర అంశాలతో ఇచ్చట వాహనములు చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ సభ్యులు అభినందించారు.
ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు, రీసెంట్గా విడుదలైన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్.దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది.
లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
వెన్నెలకిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం పాత్రలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.
నటీనటులు:
సుశాంత్, మీనాక్షి చౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఎస్.దర్శన్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల
నిర్మాణ సంస్థలు: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
డైలాగ్స్: సురేశ్ భాస్కర్
ఆర్ట్: వి.వి