ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో  ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా, మెహరీన్‌లు  హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను  ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో  దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను  రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా,  తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్ : అనిల్ రావిపూడి
సమర్పణ : దిల్ రాజు
నిర్మాత : శిరీష్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
కెమెరామెన్ : సాయి శ్రీరామ్
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్ : తమ్మిరాజు
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే : ఆది నారాయణ, నారా ప్రవీణ్