ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటున్న యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నాగ శౌర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నెం 6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేయనున్నాడు.
SLV సినిమాస్ అందరినీ ఆకట్టుకునే విభిన్న జానర్ సినిమాలను రూపొందిస్తున్నందున, టాలీవుడ్‌లో మంచి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది. పవర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కథను నాగ శౌర్య కోసం దర్శకుడు సిద్ధం చేశారు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో నావల్‌పాయింట్ నాగ శౌర్యను ఆకట్టుకుంది.
తెలుగు నూతన సంవత్సరం – ఉగాది సందర్భంగా శనివారంనాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్తగా కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కోసం అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ పనిచేయనున్నారు.
ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
తారాగణం: నాగ శౌర్య
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్