హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చగా దేవ్ పవార్ సాహిత్యాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని `పిల్లా నీవల్ల` అనే సెకండ్ లిరికల్ వీడియోని హీరో శ్రీకాంత్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… “ పిల్లా నీవల్ల లిరికల్ వీడియో చూశాను. పాట వినడానికి ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా రిచ్ గా ఉంది. దుబాయ్ లో సాంగ్ ను చాలా గ్రాండ్ గా పిక్చరైజ్ చేశారు. హీరో సాయి రోనక్ డాన్స్ లో మంచి గ్రేస్ ఉంది. ఈ సాంగ్ తో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా“ అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..“మా మూవీలో ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ పిల్లా నీవల్లా యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నెల 19న వస్తోన్న మా సినిమాను, మా పాటలను పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు. దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ…“ఇటీవల విడుదల చేసిన టీజర్ కు , ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ తో పాటు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి. సెకండ్ సింగిల్ `పిల్లా నీవల్ల` సాంగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి థ్యాంక్స్. ఈ సాంగ్ ని కూడా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు. శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క; ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు; ప్రొడక్షన్ కంట్రోలర్ః పడాల సత్య శ్రీనివాస్; పీఆర్ ఓః రమేష్ చందు, నగేష్ పెట్లు, ఫైట్స్ః నభా-సుబ్బు, కొరియోగ్రఫీః వెంకట్ దీప్; సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి; నిర్మాతః ఉదయ్ కిరణ్, రచన-దర్శకత్వంః సురేష్ శేఖర్ రేపల్లె.