స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై … లాంచనంగా ప్రారంభమైన వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ 25వ చిత్రం
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వరాయ ఉగ్రరూస్య’ చిత్రాలతో పాటు రీసెంట్‌గా ‘తిమ్మరుసు’తో సూపర్ హిట్స్ సాధించిన హీరో సత్యదేవ్..ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో నటుడిగా, హీరోగా మెప్పిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సత్యదేవ్ 25వ చిత్రం బుధవారం లాంచనంగా ప్రారంభమైంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్.నెం.2గా కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజుగారు క్లాప్‌కొట్టగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ కొరటాల శివ, ప్రముఖ ఫైనాన్సియర్ ఎంఆర్‌విఎస్.ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడు వి.వి.గోపాలకృష్ణకు అందించారు. ఇది వరకే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మరో సరికొత్త పాత్రలో సత్యదేవ్ మెప్పించనున్నారని కాన్సెప్ట్ పోస్టర్‌తో అర్థమైంది.
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్ తన 25వ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడనేది ఆసక్తిని రేపే అంశాల్లో ఒకటైతే.. ఇప్పటి వరకు ఏ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారి ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. కాల భైరవ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇందులో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నటీనటులు: సత్యదేవ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కొరటాల శివబ్యానర్: అరుణాచల క్రియేషన్స్‌నిర్మాత: కృష్ణ కొమ్మలపాటిదర్శకత్వం: వి.వి.గోపాల కృష్ణసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటిఎడిటర్: నవీన్ నూలిఆర్ట్: రామ్ కుమార్‌ఫైట్స్: వెంకట్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సుర్నెద్ది
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో ప్రారంభమైన సత్యదేవ్ 25వ చిత్రం