చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’... డబ్బింగ్ చెబుతున్న‌ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’… డబ్బింగ్ చెబుతున్న‌ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్

జాతీయ స్థాయిలో అతి పెద్ద మ‌ల్టీస్టార‌ర్ మూవీగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం భార‌తదేశ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. హైద‌రాబాద్ ప‌లు ప్ర‌దేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రేక్ష‌కుల‌ను మ‌రో కాలానికి తీసుకెళుతుంది.
ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ రెండు పాట‌లు మిన‌హా మిగిలిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాట‌ల చిత్రీక‌రణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రోవైపు ‘ఆర్ఆర్ఆర్‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్.. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సెట్స్‌లో కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ త‌గు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటూ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకున్నారు రాజ‌మౌళి అండ్ టీమ్‌.
ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అన్ని భాష‌ల‌కు చెందిన పాన్ ఇండియా న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుల‌కు సిద్ధ‌మ‌వుతోంది.చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’… డబ్బింగ్ చెబుతున్న‌ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ జాతీయ స్థాయిలో అతి పెద్ద మ‌ల్టీస్టార‌ర్ మూవీగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం భార‌తదేశ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. హైద‌రాబాద్ ప‌లు ప్ర‌దేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రేక్ష‌కుల‌ను మ‌రో కాలానికి తీసుకెళుతుంది. ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ రెండు పాట‌లు మిన‌హా మిగిలిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాట‌ల చిత్రీక‌రణ‌తో ఎంటైర్ షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రోవైపు ‘ఆర్ఆర్ఆర్‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్.. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సెట్స్‌లో కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ త‌గు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటూ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకున్నారు రాజ‌మౌళి అండ్ టీమ్‌. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అన్ని భాష‌ల‌కు చెందిన పాన్ ఇండియా న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుల‌కు సిద్ధ‌మ‌వుతోంది.