• రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు, త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారు
  • రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామ‌నుకున్నా కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కి మార్చాను, అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ గా మారింది
  • కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాము, కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లు కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగింది
  • జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్ గా ఓ విష‌యాన్ని చెప్పాము, అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్
  • రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్ర‌భాస్ న‌టించారు, ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్
  • దేశాల ప్ర‌భుత్వాల‌నే మార్చేసెంత శ‌క్తిగా సోషల్ మీడియా త‌యారైంది, అన్ని చిత్రాల ప్ర‌మోష‌న్స్ కి మీడియాతో పాటు సోష‌ల్ మీడియా అవ‌స‌రం
  • రాధేశ్యామ్ ని థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లారు
  • ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా, రొమాంటిక్ గా ఉండ‌నుంది
  • రాధేశ్యామ్ లో మెజార్టీ విఎఫ్ ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్ లోనే చేయించాము, అన్ని స‌కాలంలోనే పూర్తి చేశాము